AP News: ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే!

ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్‌లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది.

Published : 17 May 2024 09:44 IST

ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్‌లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. జీసీకేసీ ప్రాజెక్ట్స్‌ అండ్‌ వర్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ప్రతిమా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థలు ముందస్తు అనుమతులు లేకుండా యంత్రాలతో ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నాయని పేర్కొంది.  శ్రీకాకుశం శాండ్‌ రీచ్‌, స్టాక్‌యార్డ్‌, లంకపల్లి, రొయ్యూరు, చోడవరం, మున్నలూరు రీచ్‌లలో పర్యటించినట్లు తెలిపింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొత్తపల్లి, చింతపల్లి రీచ్‌, స్టాక్‌యార్డ్‌, కోగంటివారిపాలెం, మల్లాడి, పొందుగల, వైకుంఠపురం రీచ్‌లలో పర్యటించినట్లు పేర్కొంది.

Tags :

మరిన్ని