TS News: జూన్‌ మొదటి వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు: వాతావరణశాఖ

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలో ప్రవేశిస్తాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారిణి శ్రావణి తెలిపారు.

Published : 30 May 2024 17:08 IST

కేరళ తీరప్రాంతాల్లో గత నాలుగైదు రోజులుగా అధిక వర్షాలు కురవడంతో పాటు రుతుపవనాలకు కావాల్సిన అనుకూలమైన వాతావరణం ఏర్పడటం వల్ల ఒక్క రోజు ముందుగానే నైరుతి ఆగమనం జరిగినట్లు హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలో ప్రవేశించి రెండో వారంలో రాష్ర్టమంతటా విస్తారిస్తాయని చెప్పారు. రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినప్పటికీ ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదన్నారు. రెండు రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణం కన్నా ఒకటి నుంచి రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయన్నారు.

Tags :

మరిన్ని