Yogi Adityanath: అధికారం కోసం విపక్షాలు అన్ని రకాల కుయుక్తులు పన్నుతున్నాయి: యోగి ఆదిత్యనాథ్

ప్రజల్ని కులం, మతం ఆధారంగా విభజించి దేశాన్ని లూటీ చేయాలని ఇండియా కూటమి ప్రణాళిక రచిస్తోందని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు.

Updated : 21 May 2024 19:31 IST

ప్రజల్ని కులం, మతం ఆధారంగా విభజించి దేశాన్ని లూటీ చేయాలని ఇండియా కూటమి ప్రణాళిక రచిస్తోందని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్‌ రాంపుర్‌లో నిర్వహించిన సభలో యోగి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భాజపా ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలకు సేవ చేస్తోందని చెప్పారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ స్ఫూర్తితో పని చేస్తున్నట్టు తెలిపారు. వెనుకబడిన కులాల ప్రజల హక్కులను కాలరాయడానికి ఇండియా కూటమి నేతలు దురుద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని యోగి ఆరోపించారు. ఈ కుట్ర పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అధికారం కోసం ఇండియా కూటమి అన్ని రకాల కుయుక్తులను ఉపయోగిస్తోందని దుయ్యబట్టారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు