Ebrahim Raisi: ప్రాసిక్యూటర్‌ నుంచి ప్రెసిడెంట్‌ వరకు.. ఇబ్రహీం రైసీ ప్రస్థానమిది!

ప్రస్తుత ఇరాన్‌ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ, అంతకుముందు అధినేతగా ఉన్న ఖొమైనీ అండతో మతబోధకుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఇబ్రహీం రైసీ అంచెలంచెలుగా అధ్యక్ష స్థానం వరకు ఎదిగారు.

Published : 21 May 2024 11:36 IST

ఇబ్రహీం రైసీ.. ప్రస్తుత ఇరాన్‌ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీకే కాదు.. అంతకుముందు అధినేతగా ఉన్న ఖొమైనీకీ సన్నిహితుడే. ఈ ఇద్దరి అధినేతల అండతోనే మతబోధకుడిగా ప్రస్థానం ప్రారంభించిన రైసీ అధ్యక్ష స్థానం వరకు ఎదిగారు. మత ప్రబోధకుడిగా జీవితం ఆరంభించారు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. తొలుత ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహించారు.భవిష్యత్తులో ఇరాన్ సుప్రీం లీడర్ పీఠాన్ని అధిరోహిస్తారని భావించిన వేళ హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మరణించడం ఆ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.

Tags :

మరిన్ని