Viral Video: టోల్ చెల్లించాలని అడిగితే.. టోల్‌గేట్‌నే ధ్వంసం చేసిన జేసీబీ డ్రైవర్!

టోల్ చెల్లించాలని అడిగినందుకు ఓ జేసీబీ డ్రైవర్.. టోల్ గేట్‌నే ధ్వంసం చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.

Published : 11 Jun 2024 18:17 IST

టోల్ చెల్లించాలని అడిగినందుకు ఓ జేసీబీ డ్రైవర్.. టోల్ గేట్‌నే ధ్వంసం చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. దిల్లీ-లఖ్‌నవూ జాతీయ రహదారిపై హాపూర్ వద్ద ఉన్న టోల్ గేట్ నుంచి జేసీబీ వెళుతుండగా సిబ్బంది ఆపారు. టోల్ రుసుము చెల్లించాలని జేసీబీ డ్రైవర్‌ను అడిగారు. టోల్ చెల్లించేందుకు నిరాకరించిన డ్రైవర్.. ఆగ్రహంతో టోల్ గేట్‌నే ధ్వంసం చేశాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Tags :

మరిన్ని