Kajal Aggarwal: కాజల్‌ గొప్ప నటి అవుతుందని.. ఆ పాట పాడినప్పుడే అనుకున్నాం!: కాజల్‌ తల్లిదండ్రులు

కాజల్‌ చిన్నతనంలో ఆ పాట పాడినప్పుడే.. పెద్దయ్యాక అమె గొప్ప నటి అవుతుందని తాను అనుకున్నట్టు కాజల్‌ తండ్రి వినయ్ అగర్వాల్‌ చెప్పారు. సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా దూసుకుపోతున్న కాజల్‌ అగర్వాల్‌ తాజాగా నటించిన చిత్రం ‘సత్యభామ’. ఈ సినిమా జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కాజల్ తల్లిదండ్రులు ఆమె చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Published : 29 May 2024 15:48 IST

కాజల్‌ చిన్నతనంలో ఆ పాట పాడినప్పుడే.. పెద్దయ్యాక అమె గొప్ప నటి అవుతుందని తాను అనుకున్నట్టు కాజల్‌ తండ్రి వినయ్ అగర్వాల్‌ చెప్పారు. సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా దూసుకుపోతున్న కాజల్‌ అగర్వాల్‌ తాజాగా నటించిన చిత్రం ‘సత్యభామ’. ఈ సినిమా జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కాజల్ తల్లిదండ్రులు ఆమె చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. స్కూల్‌కు వెళ్లకుండా ఉండేందుకు కాజల్ చేసిన యాక్టింగ్‌ను చూసి నిజమే అనుకున్నానని తల్లి సుమన్‌ అగర్వాల్‌ చెప్పారు. తమ కుమార్తె ఇంత గొప్ప స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎన్నాళ్ల నుంచో కాజల్‌ను యాక్షన్‌ పాత్రలో చూడాలని అనుకుంటున్నామని.. ఆ కోరిక ‘సత్యభామ’తో తీరుతోందని వివరించారు. ఈ మేరకు పలు ఆసక్తికర అంశాలను ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 

Tags :

మరిన్ని