నిధుల లేమితో సతమతమవుతున్న నదీ యాజమాన్య బోర్డులు

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు నిధుల లేమితో సతమతమవుతున్నాయి.

Published : 21 May 2024 09:39 IST

నదీ యాజమాన్య బోర్డులు నిధుల లేమితో సతమతమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో బోర్డుల నిర్వహణ క్లిష్టంగా మారింది. బడ్జెట్ ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిధులు ఇవ్వాలని నదీయాజమాన్య బోర్డులు పలుమార్లు కోరాయి. దిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమావేశం నిర్వహించి నిధులు విడుదల చేయాలని చెప్పినా జరగలేదని బోర్డులు అంటున్నాయి. ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు సరిపడా నిధులు లేవని చెప్తున్నారు.  

Tags :

మరిన్ని