YSR Dist: ముద్దనూరులో లారీ బీభత్సం.. బ్రేక్‌ ఫెయిల్‌ అయి ఇంట్లోకి దూసుకెళ్లి..

వైఎస్సాఆర్‌ జిల్లా ముద్దనూరులో సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తూ ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది.

Published : 18 May 2024 13:04 IST

వైఎస్సాఆర్‌ జిల్లా ముద్దనూరులో సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తూ ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం అర్ధరాత్రి లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ముద్దనూరులోని రైల్వే గేటును ధ్వంసం చేసుకుంటూ ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ముద్దనూరు సీఐ దస్తగిరి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్రేన్ సహాయంతో లారీని బయటికి తీసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. లారీని బయటికి తీస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.  

Tags :

మరిన్ని