Pinnelli: పోలీసుల కన్నుగప్పి సినీ ఫక్కీలో పిన్నెల్లి పరార్‌!

పోలింగ్‌ రోజున ఈవీఎం ధ్వంసం చేసి, అడ్డొచ్చిన వారిపై దాడులకు దిగి విధ్వంసానికి పాల్పడిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.

Published : 23 May 2024 09:25 IST

పోలింగ్‌ రోజున ఈవీఎం ధ్వంసం చేసి, అడ్డొచ్చిన వారిపై దాడులకు దిగి విధ్వంసానికి పాల్పడిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. పిన్నెల్లిని పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నంలో హైడ్రామా నెలకొంది. ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి సమీపంలో వేచి ఉండటం, బయటికి వచ్చిన కారును వెంబడించడం, కొంతదూరం వెళ్లాక ఆగిపోయిన కారులో పిన్నెల్లి కనిపించకపోవడం, అందులో ఉన్న డ్రైవర్, గన్‌మ్యాన్‌ పొసగని సమాధానాలు ఇవ్వడం.. అంతా సినీ పక్కీని తలపించింది. పక్కా ప్రణాళికతో ఆయన పారిపోయినట్లు నిర్ధారణకు వచ్చిన ఏపీ పోలీసులు ఆయన్ను పట్టుకునేందుకు వేట కొనసాగిస్తున్నారు.

Tags :

మరిన్ని