Hyderabad: మహిళల వేషధారణలో వచ్చి అపార్ట్‌మెంట్‌లో చోరీ

హైదరాబాద్‌లో దొంగలు తెగబడుతున్నారు. మహిళల వేషధారణలో వచ్చి ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీకి పాల్పడ్డారు. ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 20 May 2024 13:10 IST

హైదరాబాద్‌లో దొంగలు తెగబడుతున్నారు. మహిళల వేషధారణలో వచ్చి ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీకి పాల్పడ్డారు. ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రైవేటు ఉద్యోగి కె.వెంకటేశ్వర్రావు నివాసముంటున్నారు. 16వ తేదీ రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి ఆయన ఒంగోలు వెళ్లారు. 18వ తేదీ శనివారం ఉదయం పనిమనిషి వచ్చి చూసేసరికి తాళం పగుల గొట్టి ఉంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. ఈనెల 18న తెల్లవారుజామున ఇద్దరు దుండగులు మహిళల వేషధారణలో ముసుగులు ధరించి వచ్చినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

మరిన్ని