Uttamkumar: కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతు పనులు వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్‌

కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు పనులను వేగవంతం చేయాలని నిర్మాణ సంస్థలు, సంబంధిత అధికారులను ఆదేశిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Published : 07 Jun 2024 17:13 IST

కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు పనులను వేగవంతం చేయాలని నిర్మాణ సంస్థలు, సంబంధిత అధికారులను ఆదేశిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్‌ ముగియడంతో అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల పరిశీలనకు మంత్రి ఉత్తమ్‌ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని, అయినా అప్పటి సర్కార్‌ ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు.

Tags :

మరిన్ని