Mallareddy: దౌర్జన్యంగా మా భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు: ఎమ్మెల్యే మల్లారెడ్డి

పోలీసు, ప్రభుత్వ సహకారంతో తమ భూమిలో అక్రమంగా ప్రవేశించడమే కాకుండా.. నిర్మాణాలను కూల్చివేశారంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆరోపణలు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల విలేజ్ సర్వేనెంబర్ 82, 83లో సుచిత్ర మిలిటరీ కాంపౌండ్ వాల్ రోడ్డులో రెండు ఎకరాల 10 గుంటల స్థలంపై వివాదం నెలకొంది.

Published : 18 May 2024 17:50 IST

పోలీసు, ప్రభుత్వ సహకారంతో తమ భూమిలో అక్రమంగా ప్రవేశించడమే కాకుండా.. నిర్మాణాలను కూల్చివేశారంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆరోపణలు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల విలేజ్ సర్వేనెంబర్ 82, 83లో సుచిత్ర మిలిటరీ కాంపౌండ్ వాల్ రోడ్డులో రెండు ఎకరాల 10 గుంటల స్థలంపై వివాదం నెలకొంది. 11 ఏళ్ల నుంచి తాము పొజిషన్‌లో ఉన్న భూమిలో కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి అక్రమంగా ప్రవేశించి అక్కడ ఉన్న నిర్మాణాలను కూల్చివేయడమే కాకుండా ఫెన్సింగ్ నిర్మాణం చేశారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ విషయంపై శనివారం ఉదయం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. సిబ్బంది లేరంటూ పోలీసులు సమాధానం ఇచ్చారని, దీంతో చేసేదేమీలేక తానే స్వయంగా భూమి వద్దకు వచ్చానని మల్లారెడ్డి చెప్పారు.

Tags :

మరిన్ని