చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. నాలుగురోజుల పాటు భారీ వర్ష సూచన: ఐఎండీ

ఉపరితల ఆవర్తనం, షియర్‌ జోన్‌ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Updated : 07 Jun 2024 20:17 IST

ఉపరితల ఆవర్తనం, షియర్‌ జోన్‌ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయని వాతావరణశాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం, ఉపరితల ఆవర్తనం, షియర్‌ జోన్‌ ప్రభావంతో రెండ్రోజుల పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధితో పాటు,  ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో  భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Tags :

మరిన్ని