Nagababu: దేశం గుర్తించే స్థాయికి మా తమ్ముడు ఎదగడం గర్వంగా ఉంది: నాగబాబు

జనసేన గెలుపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టమని ఆ పార్టీ కార్యదర్శి నాగబాబు అన్నారు. ఏపీకి ఇక అన్ని మంచి రోజులేనని పేర్కొన్నారు. చిరంజీవి నివాసంలో పవన్‌కు ఘన స్వాగతం పలికిన అనంతరం నాగబాబు మీడియాతో మాట్లాడారు.

Published : 06 Jun 2024 21:41 IST

జనసేన గెలుపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టమని ఆ పార్టీ కార్యదర్శి నాగబాబు అన్నారు. ఏపీకి ఇక అన్ని మంచి రోజులేనని పేర్కొన్నారు. చిరంజీవి నివాసంలో పవన్‌కు ఘన స్వాగతం పలికిన అనంతరం నాగబాబు మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబం పదవుల్లో ఉన్నా లేకున్నా ఎప్పుడూ ప్రజలకు సేవ చేస్తుందన్నారు. ఈ క్రమంలో జనసేన గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. కుటుంబంలో ఒకరు దేశం గర్వించే స్థాయికి ఎదగడం ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పారు. కూటమి గెలుపులో పవన్ కీలకం కావడం, గెలవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు