Modi: పలువురు భాజపా దిగ్గజ నేతలను కలిసిన మోదీ

ఎన్డీయే పార్లమెంటరీ నేతగా ఎన్నికైన అనంతరం నరేంద్రమోదీ పలువురు భాజపా సీనియర్‌ నేతలను కలిశారు.

Published : 07 Jun 2024 17:28 IST

ఎన్డీయే పార్లమెంటరీ నేతగా ఎన్నికైన అనంతరం నరేంద్రమోదీ (Modi) పలువురు భాజపా సీనియర్‌ నేతలను కలిశారు. మాజీ ఉప ప్రధాని, భారతరత్న అవార్డు గ్రహీత ఎల్‌.కె. అడ్వాణీని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. అడ్వాణీకి పుష్పగుచ్చం ఇచ్చి ఆశీస్సులు తీసుకున్నారు. కాసేపు ఆయనతో మోదీ ముచ్చటించారు. ఆ తర్వాత భాజపా మాజీ అధ్యక్షుడు మురళీ మనోహార్ జోషి నివాసానికి వెళ్లారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు.

Tags :

మరిన్ని