Unemployment: ఐఐటీల్లోనూ ఉద్యోగ సంక్షోభం!

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లోనూ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ క్రమంగా తగ్గుతున్నాయి.

Published : 24 May 2024 13:18 IST

మన దేశంలో ఐఐటీలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివితే చాలు..  మంచి కంపెనీల్లో ఉద్యోగాలు, రూ.లక్షల్లో వేతన ప్యాకేజీల్లాంటి మాటల్నే తరచూ వింటూ ఉంటాం. కానీ, ప్రస్తుతం నిరుద్యోగం పెరగడంతో అందుకు భిన్నమైన పరిస్థితులు వెలుగుచూస్తున్నాయి. మన దేశంలోని ఐఐటీల్లో విద్యనభ్యసించిన విద్యార్థుల్లో ఈ ఏడాది దాదాపు 38శాతం మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ దక్కకపోవడం గమనార్హం. ఐఐటీ కాన్పూర్‌ పూర్వ విద్యార్థి ధీరజ్‌సింగ్‌ సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా సేకరించిన సమాచారంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు