Rameshwaram Cafe Blast: ఎన్‌ఐఏ కస్టడీలో ఐటీ ఉద్యోగి సోహైల్‌

అనంతపురం జిల్లాలో ఉగ్రవాదులతో సంబంధాలున్న ఐటీ ఉద్యోగిని ఎన్‌ఐఏ గుర్తించింది.

Published : 22 May 2024 11:33 IST

అనంతపురం జిల్లాలో ఉగ్రవాదులతో సంబంధాలున్న ఐటీ ఉద్యోగిని ఎన్‌ఐఏ గుర్తించింది. రాయదుర్గంలో 3 రోజులు రెక్కీ నిర్వహించిన అధికారులు విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్‌గఫూర్ ఇంటిని చుట్టుముట్టారు. ఏ ఒక్కరినీ బయటకు రానీయకుండా గఫూర్ కుమారుడు సోహైల్‌ను 3 గంటల పాటు విచారించారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల నిందితులు, సోహైల్‌తో ఒకే గదిలో నివసించినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఎన్‌ఐఏ ఆమేరకు దర్యాప్తు ముమ్మరం చేసింది.

Tags :

మరిన్ని