Israel-Hamas-Conflict: రఫాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌.. యుద్ధంలో ఏం జరుగుతోంది?

యుద్ధం మొదలై 7నెలలు దాటి పోయింది. ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. మృతుల సంఖ్య 35వేలకు పైనే. క్షతగాత్రుల సంఖ్యకు లెక్కే లేదు. ఇదీ ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం పరిస్థితి. అలాంటి యుద్ధంలో మరో విషాదం చోటు చేసుకుంది. రఫా నగరంలోని ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో పిల్లలు, మహిళలు సహా 45 మంది ప్రాణాలు కోల్పోయారు.

Published : 30 May 2024 15:53 IST

యుద్ధం మొదలై 7నెలలు దాటి పోయింది. ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. మృతుల సంఖ్య 35వేలకు పైనే. క్షతగాత్రుల సంఖ్యకు లెక్కే లేదు. ఇదీ ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం పరిస్థితి. అలాంటి యుద్ధంలో మరో విషాదం చోటు చేసుకుంది. రఫా నగరంలోని ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో పిల్లలు, మహిళలు సహా 45 మంది ప్రాణాలు కోల్పోయారు. సురక్షిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడటంపై సర్వత్రా విమర్శలు మెుదలయ్యాయి. ఈ ఘటనను భారత్‌లో పలువురు సెలబ్రిటీలు సైతం ఖండించారు. ఆల్ ఐస్ ఆన్ రఫా పేరుతో సోషల్ మీడియా ఖాతాలోనూ పోస్ట్ చేసి.. కాల్పుల విరమణకు అభ్యర్థించారు. అసలు యుద్ధంలో ఏం జరుగుతోంది? ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఇలా విరుచుకుపడడానికి కారణం ఏమిటి? హమాస్ తర్వాతి ప్రణాళిక ఎలా ఉండబోతోంది?

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు