భవిష్యత్‌లో ఉద్యోగం చేయడం ఐచ్ఛికం మాత్రమే: ఎలాన్‌ మస్క్‌

ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఈ అధునాతన సాంకేతికత ప్రభావం గురించి వివరించారు.

Published : 24 May 2024 16:19 IST

టెక్‌ ప్రపంచంలో కృత్రిమ మేధ (Artificial Intelligence - AI ) సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. ఆ దిశగా జరుగుతున్న ప్రయోగాలు, పరిశోధనలు ఓ వైపు ఆసక్తి రేకెత్తిస్తూనే.. మరోవైపు ఆందోళనకూ గురిచేస్తున్నాయి. ఉపాధి అవకాశాలు కనుమరుగవుతాయనే వాదన కొన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. దీనిపై టెక్‌ నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలను నేటి యువతరం నిశితంగా పరిశీలిస్తోంది. ఇటీవల మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల.. ఏఐని మనుషుల్లా చూడడం ఆపాలని గట్టిగానే హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా ప్యారిస్‌ కేంద్రంగా ‘వివా టెక్‌’ పేరిట నిర్వహించిన స్టార్టప్‌ సదస్సులో టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

Tags :

మరిన్ని