Trash Balloons: దక్షిణ కొరియాలో చెత్త బెలూన్ల కలకలం

దక్షిణ కొరియా సరిహద్దు ప్రావిన్సుల్లో చెత్త నింపిన బెలూన్లను ఉత్తర కొరియా పంపించింది. సుమారు 200 భారీ బెలూన్లను దక్షిణ కొరియాలోకి పంపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని.. దేశంలోకి వచ్చిన తెలుపు రంగు బెలూన్లను ఎవరూ తాకొద్దని దక్షిణ కొరియా మిలిటరీ హెచ్చరించింది.

Published : 29 May 2024 19:38 IST

దక్షిణ కొరియా సరిహద్దు ప్రావిన్సుల్లో చెత్త నింపిన బెలూన్లను ఉత్తర కొరియా పంపించింది. సుమారు 200 భారీ బెలూన్లను దక్షిణ కొరియాలోకి పంపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని.. దేశంలోకి వచ్చిన తెలుపు రంగు బెలూన్లను ఎవరూ తాకొద్దని దక్షిణ కొరియా మిలిటరీ హెచ్చరించింది. ఆ గాలి బుడగల్లో చెత్త, మానవ వ్యర్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 8 ప్రావిన్సుల్లో ఆ భారీ బెలూన్లను అధికారులు గుర్తించారు. ఆ గాలి బుడగల్లోని వ్యర్థాలను పరిశీలిస్తున్నట్లు దక్షిణ కొరియా తెలిపింది. ఇటీవల సరిహద్దులో దక్షిణ కొరియా కరపత్రాలను జార విడుస్తోందని, అలా చేస్తే తాము ఊరుకోబోమని హెచ్చరించిన ఉత్తర కొరియా.. తాజా ఘటనకు పూనుకున్నట్లు తెలుస్తోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు