Tummala: ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా ఉంది: మంత్రి తుమ్మల

దేశంలో.. ప్రత్యేకంగా తెలంగాణలో వరి సాగు గణనీయంగా పెరుగుతుందని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Updated : 07 Jun 2024 20:17 IST

దేశంలో.. ప్రత్యేకంగా తెలంగాణలో వరి సాగు గణనీయంగా పెరుగుతుందని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో ఇంటర్నేషనల్‌ కమోడిటీ ఇన్‌స్టిట్యూట్‌ (ఐసీఐ) ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌-2024ను మంత్రులు ప్రారంభించారు. భారత్‌ సహా 25 దేశాల ప్రతినిధులు, ఐసీఏఆర్‌ అనుబంధ ఐఐఆర్‌ఆర్‌ శాస్త్రవేత్తలు, రైస్‌ మిల్లర్ల సంఘాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత్‌లో ఏటా 26 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతోందని తుమ్మల అన్నారు. ప్రపంచ బియ్యం భాండాగారంగా దేశం అవతరించిందని చెప్పారు.

Tags :

మరిన్ని