Sanga Reddy: ప్రయాణికులను మధ్యలోనే వదిలి వెళ్లిపోయిన బస్సు డ్రైవర్‌!

గోవా వెళ్లాల్సిన ప్రయాణికులను ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ యాజమాన్యం మధ్యలోనే వదిలేసి వెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి గోవా వెళ్లేందుకు పలువురు ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారు. అందులో సౌకర్యాలు ఏమీ లేవని ప్రయాణికులు అడగ్గా.. డ్రైవర్ దురుసుగా ప్రవర్తించి అశోక్ నగర్ రహదారిపై బస్సును వదిలేసి వెళ్లిపోయాడు.

Published : 21 May 2024 17:41 IST

గోవా వెళ్లాల్సిన ప్రయాణికులను ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ యాజమాన్యం మధ్యలోనే వదిలేసి వెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి గోవా వెళ్లేందుకు పలువురు ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారు. అందులో సౌకర్యాలు ఏమీ లేవని ప్రయాణికులు అడగ్గా.. డ్రైవర్ దురుసుగా ప్రవర్తించి అశోక్ నగర్ రహదారిపై బస్సును వదిలేసి వెళ్లిపోయాడు. ట్రావెల్స్ యాజమాన్యం కూడా ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ప్రయాణికులు రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బస్సును స్టేషన్‌కు తరలించడంతో ప్రయాణికులు పిల్లలతో రాత్రంతా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags :

మరిన్ని