Vizianagaram: నేటికీ అందని పింఛన్.. వృద్ధుల ఆవేదన!

ఒకటో తేదీన అందించాల్సిన పింఛను.. నేటి వరకూ ఇవ్వలేదంటూ విజయనగరంలో వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు ఖాతా పనిచేయకపోవటంతో.. విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో ఖాతాను యాక్టివేట్‌ చేయించుకున్నామన్నారు.

Published : 25 May 2024 20:48 IST

ఒకటో తేదీన అందించాల్సిన పింఛను.. నేటి వరకూ ఇవ్వలేదంటూ విజయనగరంలో వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు ఖాతా పనిచేయకపోవటంతో.. విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో ఖాతాను యాక్టివేట్‌ చేయించుకున్నామన్నారు. అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నామని తమ గోడు వెలిబుచ్చారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుల్ని వెంటపెట్టుకుని నగరపాలక కార్యాలయానికి తిరుగుతున్నామని సహాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని