NTR Health University: ఆరోగ్య వర్శిటీకీ ఎన్టీఆర్‌ పేరు పెట్టాల్సిందే: ప్రభుత్వానికి లేఖలు

ఎన్టీఆర్ వర్శిటీ లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు, భవనాలకు గతంలో ఉన్న మహనీయుల పేర్లను తొలగించడంపై అప్పట్లోనే ప్రజాగ్రహం పెల్లుబికింది. ప్రస్తుతం జగన్ గద్దె దిగడంతో మార్చిన పేర్లను వెంటనే తొలగించాలంటూ ప్రజలు, ఆయా సంస్థల్లో పనిచేసే సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ లేఖలు రాస్తున్నారు.

Published : 10 Jun 2024 12:15 IST

ఐదేళ్ల జగన్ పాలనలో అకృత్యాలు, దౌర్జన్యాలతో విసిగిపోయిన ప్రజలు.. వైకాపాకు గట్టి గుణపాఠం చెప్పారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క సీటూ వైకాపాకు కట్టబెట్టకుండా తుడిచిపెట్టేశారు. ఎన్టీఆర్ వర్శిటీ లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు, భవనాలకు గతంలో ఉన్న మహనీయుల పేర్లను తొలగించడంపై అప్పట్లోనే ప్రజాగ్రహం పెల్లుబికింది. అయినా లెక్కచేయకుండా నియంత పోకడలతో విచ్చలవిడిగా వైకాపా సర్కార్ చెలరేగిపోయింది. ప్రస్తుతం జగన్ గద్దె దిగడంతో మార్చిన పేర్లను వెంటనే తొలగించాలంటూ ప్రజలు, ఆయా సంస్థల్లో పనిచేసే సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ లేఖలు రాస్తున్నారు.

Tags :

మరిన్ని