AP News: వివాదాస్పద అధికారులను కలిసేందుకు చంద్రబాబు విముఖత

గత ప్రభుత్వ హయాంలో కళంకిత అధికారులుగా పేరు తెచ్చుకున్న వారి పట్ల తమ వైఖరి ఎలా ఉండబోతోందో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారు.

Published : 06 Jun 2024 14:21 IST

గత ప్రభుత్వ హయాంలో కళంకిత అధికారులుగా పేరు తెచ్చుకున్న వారి పట్ల తమ వైఖరి ఎలా ఉండబోతోందో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడి ఈసీ చర్యలకు బలైన అధికారులను కలిసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడట్లేదు. తమ తప్పేమీ లేదని, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే చేశామని తెలుగుదేశం నేతలతో రాయబారాలు నడుపుతున్న కొందరి అధికారులను చంద్రబాబు ఇంటి గేటు కూడా దాటనివ్వట్లేదు.

Tags :

మరిన్ని