AP High Court: షరతులు ఉల్లంఘిస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చు: హైకోర్టు

పోలింగ్‌ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో అరాచకం సృష్టించిన వైకాపా ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో మూడు కేసుల్లో అరెస్టు నుంచి జూన్‌ 6 వరకు రక్షణ కల్పిస్తూ మంగళవారం హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

Published : 29 May 2024 09:20 IST

ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిని అరెస్ట్  చేయొద్దంటూ ఇప్పటికే స్పష్టం చేసిన ధర్మాసనం.. మాచర్ల హింసలో పోలీసులు నమోదు చేసిన ఇతర కేసుల్లోనూ ఆ తేదీ వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. పిన్నెల్లి రోజూ ఎస్పీ కార్యాలయంలో హాజరుకావాలని పాస్‌పోర్టు కోర్టులో అప్పగించాలని అనుమతి లేకుండా దేశం దాటొద్దని తేల్చి చెప్పింది. నరసరావుపేటలోనే ఉండాలని సాక్షులను కలవడానికి వీల్లేదని ఆంక్షలు విధించింది. ఆయనపై నిఘా ఉంచాలని సీఈఓను ఆదేశించింది. బాధితులకు రక్షణ కల్పించాలని పల్నాడు ఎస్పీకి స్పష్టం చేసింది.న్యాయస్థానం విధించిన షరతులను ఉల్లంఘిస్తే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు వెసులుబాటు ఇచ్చింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు