MLC Bypoll: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

Published : 27 May 2024 10:12 IST

వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపఎన్నిక మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. 12 జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరగనున్న ఈ ఓటింగ్ కోసం 605 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఓటు వేసేందుకు ప్రైవేటు సంస్థల యజమాన్యాలు సహకరించాలని సీఈఓ వికాస్ రాజ్  కోరారు. కాగా జూన్ 5న ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.

Tags :

మరిన్ని