రాహుల్ వాడే భాష.. మావోయిస్టుల భాషలా ఉంది: ప్రధాని మోదీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాడే భాష.. మావోయిస్టుల భాషలా ఉండటం వల్ల ఆ పార్టీ, వారి మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులకు పారిశ్రామిక వేత్తలు 50 సార్లు ఆలోచిస్తున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.

Updated : 19 May 2024 20:18 IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాడే భాష.. మావోయిస్టుల భాషలా ఉండటం వల్ల ఆ పార్టీ, వారి మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులకు పారిశ్రామిక వేత్తలు 50 సార్లు ఆలోచిస్తున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, జేఎంఎం పార్టీలకు అభివృద్ధి గురించి ఏమీ తెలియదన్నారు. ప్రతిచోటా బిగ్గరగా అబద్ధాలు మాట్లాడటమే వారికి తెలుసునని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పుర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు.

Tags :

మరిన్ని