Rahul Gandhi: కుంగిన సభావేదిక.. రాహుల్‌ గాంధీకి తప్పిన ప్రమాదం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తృటిలో ప్రమాదం తప్పింది.

Published : 27 May 2024 20:27 IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్‌లోని పాలిగంజ్‌లో సభపైకి రాహుల్ చేరుకున్న సమయంలో.. వేదిక ఒక్కసారిగా కిందకు కుంగింది. ఆ సమయంలో లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె మిషా భారతి.. రాహుల్  చేతిని పట్టుకున్నారు. వారితో పాటు మరికొందరు పార్టీ నేతలు వేదికపై ఉన్నారు. ఒకరి చేతిని ఒకరు పట్టుకోవడంతో వారు కిందపడలేదు. వెంటనే వ్యక్తిగత భద్రతా సిబ్బంది వారి దగ్గరకు వెళ్లగా.. ఏం ఫర్వాలేదంటూ రాహుల్, భారతిలు నవ్వుకుంటూ సమాధానం ఇచ్చారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు