Ramoji Rao: మార్గదర్శితో రామోజీరావు ప్రస్థానం

ప్రతిమనిషి జీవితంలో ఆర్థిక భద్రత, భరోసా ఎంత అవసరమో గుర్తించి, ఆ దిశగా అందరికీ వెలుగుబాట చూపే కాంతిస్తంభంగా రామోజీ ‘మార్గదర్శి’ చిట్‌ఫండ్స్ సంస్థను స్థాపించారు. ఆరు దశాబ్దాల వజ్రోత్సవ ప్రయాణంలో నమ్మకానికి చిరునామాగా ఆ సంస్థను రామోజీరావు తీర్చి దిద్దారు. సవాళ్లకు ఎదురునిలిచి లక్షలమంది ఆర్థికనేస్తంగా ఖాతాదారుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

Published : 08 Jun 2024 18:47 IST

ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదగవచ్చు? జీవితకాలంలో ఎన్ని లక్షలు, కోట్లమందిని ప్రభావితం చేయవచ్చు? క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావంతో ఎలాంటి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు.. అనడానికి ఈతరమెరిగిన స్ఫూర్తి శిఖరంగా రామోజీరావు నిలిచారు. ఈ క్రమంలో ప్రతిమనిషి జీవితంలో ఆర్థిక భద్రత, భరోసా ఎంత అవసరమో గుర్తించి, ఆ దిశగా అందరికీ వెలుగుబాట చూపే కాంతిస్తంభంగా ఆయన ‘మార్గదర్శి’ చిట్‌ఫండ్స్ సంస్థను స్థాపించారు. ఆరు దశాబ్దాల వజ్రోత్సవ ప్రయాణంలో నమ్మకానికి చిరునామాగా ఆ సంస్థను రామోజీరావు తీర్చి దిద్దారు. సవాళ్లకు ఎదురునిలిచి లక్షలమంది ఆర్థికనేస్తంగా ఖాతాదారుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

Tags :

మరిన్ని