Khammam: రఘునాథపాలెంలో కారు ప్రమాదం.. తల్లీపిల్లల మృతిపై అనుమానాలు?

ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో అనుమానాస్పద స్థితిలో తల్లీపిల్లల మృతి పట్ల కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. తల్లీపిల్లల్ని.. భర్తే చంపేశాడంటూ ఆరోపిస్తున్నారు.

Published : 29 May 2024 12:41 IST

ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో అనుమానాస్పద స్థితిలో తల్లీపిల్లల మృతి పట్ల కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. తల్లీపిల్లల్ని.. భర్తే చంపేశాడంటూ ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం రంగాపురానికి చెందిన కుమారికి.. బావోజీ తండాకు చెందిన ప్రవీణ్ కు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు కృషిక, తనిష్క ఉన్నారు. హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో రఘునాథపాలెంలో వారు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు పక్కన ఓ చెట్టుకు కారు ఢీకొని ఉండగా.. అందులో తల్లి కుమారి, పిల్లలు కృషిక, తనిష్క చనిపోయి ఉన్నారు. వాహనం నడుపుతున్న ప్రవీణ్  గాయాలపాలై ఉన్నాడు. ఇది రోడ్డు ప్రమాదం కాదని.. తల్లీబిడ్డలను ప్రవీణ్  హత్యచేశాడని కుమారి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

Tags :

మరిన్ని