Child Trafficking: హైటెక్‌ దందాగా చిన్నారుల అక్రమ రవాణా!

చిన్నారుల్ని అక్రమ రవాణా చేసే ఏజెంట్లలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వివిధ ప్రాంతాల నుంచి రవాణా చేసే సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా కొందరు మహిళా ఏజెంట్లు తల్లుల్లా చిన్నారుల్ని తీసుకెళ్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

Published : 30 May 2024 10:21 IST

ఎవరికీ అనుమానం రాకుండా కోడ్ భాషలో సంభాషణలు.. చిన్నారుల్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించకుండా సొంత తల్లిలా నటించే మహిళలు.. తేదీ నిర్ణయిస్తే చాలు రెండు, మూడు రోజుల్లో గమ్యస్థానానికి చేర్చే ఏజెంట్లు.. రాష్ట్రంలో కలకలం రేపిన చిన్నారుల అక్రమ రవాణా రాకెట్ కేసులో తవ్వేకొద్ది విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్రణాళిక ప్రకారం నిందితులు వ్యవస్థీకృతంగా పసి పిల్లల్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Tags :

మరిన్ని