Amaravati: అమరావతి నుంచి ఆగని సామాగ్రి తరలింపు

రాజధాని అమరావతి నుంచి సామగ్రి తరలింపు కొనసాగుతూనే ఉంది.

Published : 30 May 2024 10:08 IST

రాజధాని అమరావతి నుంచి సామగ్రి తరలింపు కొనసాగుతూనే ఉంది. ఐదేళ్లుగా మిన్నకుండిన గుత్తేదారులు.. ఎన్నికల ఫలితాలు వచ్చే వేళలో చేస్తున్న తరలింపుపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం, సీఆర్‌డీఏ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నతీరుపై రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేఘా సంస్థ తాగునీటి పైపులు, విద్యుత్‌ కేబుళ్లను తరలించగా.. తాజాగా ఎల్‌ అండ్‌ టీ సంస్థ భూగర్భ పైపులు ఉంచే ప్లాస్టిక్‌ అమరికలను విక్రయించేయడంతో, వాటిని కొనుగోలు చేసిన వ్యాపారులు కంటైనర్లలో తరలిస్తున్నారు.  

Tags :

మరిన్ని