Cambodia: కాంబోడియాలో తెలంగాణ యువకుడికి చిత్రహింసలు

కాంబోడియాలో చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ యువకుడు కుటుంబ సభ్యులకు ఓ వీడియో సందేశం పంపించాడు.

Updated : 28 May 2024 14:03 IST

కాంబోడియా (Cambodia)లో చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ ఓ యువకుడు కుటుంబ సభ్యులకు ఓ వీడియో సందేశం పంపించాడు. ఆ వీడియోను చూసిన కుటుంబసభ్యులు తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంథంపల్లికి చెందిన ప్రకాశ్ అనే యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఆ ఏజెన్సీ ద్వారా ఆస్ట్రేలియాకు వెళ్తున్నట్లు కుటుంబసభ్యులకు తెలిపాడు. సదరు ఏజెన్సీ వారు మాత్రం అతడిని ఆస్ట్రేలియాకు కాకుండా కాంబోడియా తీసుకెళ్లినట్లు యువకుడు వీడియోలో తెలిపాడు. అక్కడి వారు తనపై దాడిచేస్తూ.. చిత్రహింసలకు గురిచేస్తున్నారని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. 

Tags :

మరిన్ని