Anantapur: ఎస్బీ టీం నిర్లక్ష్యంతోనే ఎన్నికల రోజు అనంతపురంలో హింస

అనంతపురం జిల్లాలో పోలింగ్ రోజున శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లినా కనీసం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా కొందరు పోలీసులు అధికారపార్టీపై స్వామిభక్తి ప్రదర్శించారు. జిల్లా ఎస్పీకి కళ్లు, చెవుల్లా పనిచేయాల్సిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అధికార పార్టీకి అమ్ముడుపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated : 24 May 2024 13:25 IST

అనంతపురం జిల్లాలో పోలింగ్ రోజున శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లినా కనీసం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా కొందరు పోలీసులు అధికారపార్టీపై స్వామిభక్తి ప్రదర్శించారు. జిల్లా ఎస్పీకి కళ్లు, చెవుల్లా పనిచేయాల్సిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అధికార పార్టీకి అమ్ముడుపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్పెషల్ బ్రాంచిలోని ఓ సీఐ పోలింగ్ రోజు ఘటనలను పైఅధికారులకు తెలియకుండా చేశారనే ఆరోపణలున్నాయి. సుమారు 10 ఏళ్లకు పైగా అనంతపురం వదలని ఆ సీఐ స్పెషల్ బ్రాంచిలోకి వెళ్లాక.. ఆయన అక్రమాల పరంపర పరాకాష్ఠకు చేరిందని పోలీసు శాఖలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. 

Tags :

మరిన్ని