Tirupati: ఎస్‌వీయూ వీసీ ఛాంబర్‌ను చుట్టుముట్టిన విద్యార్థి సంఘాలు

అక్రమ నియామకాలతో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ఎస్‌వీయూ వీసీపై విద్యార్ధి సంఘాలు, బోధన, బోధనేతర సిబ్బంది తిరగబడ్డారు.

Updated : 07 Jun 2024 20:32 IST

అక్రమ నియామకాలతో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ఎస్‌వీయూ వీసీపై విద్యార్థి సంఘాలు, బోధన, బోధనేతర సిబ్బంది తిరగబడ్డారు. ఈ ఐదేళ్లూ.. శ్రీకాంత్ రెడ్డి వీసీగా కాకుండా వైకాపా ప్రజాప్రతినిధిలా పనిచేశారని మండిపడ్డారు. వీసీ అవినీతితో విసిగిపోయామంటూ ఆయన ఛాంబర్‌ను చుట్టుముట్టి నిరసన చేపట్టారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ నియామకాల మాటున రూ.కోట్లు ఎలా దోచేస్తారని బీసీ, ఎస్సీ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అకడమిక్ కన్సల్టెంట్ యూనియన్ ప్రతినిధులు నిలదీశారు. వీసీ పదవిలో ఉండేందుకు శ్రీకాంత్ రెడ్డి అనర్హుడని ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Tags :

మరిన్ని