Film Exhibitors: మల్టీప్లెక్స్‌ తరహాలో పర్సంటేజీ ఇస్తేనే సినిమాల ప్రదర్శన: విజయేందర్‌రెడ్డి

తెలుగు సినిమాల ప్రదర్శనల విషయంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో ఇకపై అద్దె ప్రాతిపదికన కాకుండా వాటాల విధానంలోనే సినిమాలను ప్రదర్శిస్తామని స్పష్టం చేసింది.

Published : 22 May 2024 20:11 IST

తెలుగు సినిమాల ప్రదర్శనల విషయంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో ఇకపై అద్దె ప్రాతిపదికన కాకుండా వాటాల విధానంలోనే సినిమాలను ప్రదర్శిస్తామని స్పష్టం చేసింది. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్లంతా జులై 1 నుంచి వాటాల విధానంలోనే సినిమాల ప్రదర్శిస్తామని ఏకగ్రీవంగా తీర్మానించారు. బెనిఫిట్ షోలు, అదనపు ఆటలను ప్రదర్శించడం వల్ల నష్టపోతున్నామని.. అందువల్ల వాటిని కూడా నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలంగాణ ఎగ్జిబిటర్స్, నిర్వహణ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి తెలిపారు. కొందరు పంపిణీదారులు సినిమా ప్రదర్శనలను జూదంగా మార్చారని విజయేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని