TS News: రుణమాఫీ కోసం కార్పొరేషన్‌ ఏర్పాటుపై ప్రభుత్వ యోచన..!

రూ.2 లక్షల రైతు రుణమాఫీ కోసం రూ.30 వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని సర్కార్‌ యోచిస్తోంది. 

Published : 23 May 2024 10:40 IST

రైతు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు కొనసాగుతోంది. ఎన్నికల హామీకి అనుగుణంగా రూ.2 లక్షల వరకు రైతులకు రుణాలను మాఫీ చేసి తీరతామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రూ.30 వేల కోట్లకు పైగా అవసరమయ్యే ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. రైతు సంక్షేమ కార్పోరేషన్‌కు రైతుల రుణాలను బదిలీ చేసుకోవాలన్నది ప్రధాన ఆలోచన. ఆ దిశగా ఇబ్బందులు ఎదురైతే అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా సర్కార్ దృష్టి సారించింది.  

Tags :

మరిన్ని