Telangana: భూముల మార్కెట్‌ విలువ పెంపుపై తెలంగాణ సర్కార్‌ దృష్టి

తెలంగాణలో స్థిరాస్తి మార్కెట్ ధరలు మరోసారి పెంచేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతోంది.

Published : 26 May 2024 13:45 IST

తెలంగాణలో స్థిరాస్తి మార్కెట్ ధరలు మరోసారి పెంచేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఈ ప్రక్రియ మొదలు కానున్నట్లు సమాచారం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండు సార్లు మార్కెట్ ధరలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. వీటిని మరోసారి పెంచాలనే నిర్ణయంతో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కనీసం రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ విలువల పెంపుతో 1500 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.

Tags :

మరిన్ని