Pinnelli: పిన్నెల్లికి అరెస్టు నుంచి రక్షణ కల్పించొద్దు: హైకోర్టులో వాదనలు

మాచర్ల హింసలో పోలీసులు నమోదు చేసిన కేసుల్లో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అరెస్టు నుంచి రక్షణ ఇవ్వొద్దని ఫిర్యాదుదారుల తరపు న్యాయవాదులు హైకోర్టుకి నివేదించారు.

Published : 28 May 2024 09:17 IST

మాచర్ల హింసలో పోలీసులు నమోదు చేసిన కేసుల్లో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అరెస్టు నుంచి రక్షణ ఇవ్వొద్దని ఫిర్యాదుదారుల తరపు న్యాయవాదులు హైకోర్టుకి నివేదించారు. బెయిలిస్తే ఓట్ల లెక్కింపు రోజున నేరాల్ని పునరావృతం చేస్తారని వాదించారు. ఇప్పటికే 9 కేసుల్లో పిన్నెల్లి నిందితుడని పోలీసులను గాయపరిచి, తీవ్ర నేరాలకు పాల్పడ్డారని పీపీ వాదించారు. న్యాయమూర్తి నేడు నిర్ణయం వెలువరించనున్నారు.  

Tags :

మరిన్ని