వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. పూర్తికాని డొంకూరు బ్రిడ్జి

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు వద్ద 23 ఏళ్ల క్రితం నిర్మించిన ఉప్పుటేరు వంతెన శిథిలావస్థకు చేరింది. గత ఐదేళ్లలో దీని నిర్వహణ గాడి తప్పింది.

Updated : 18 May 2024 12:58 IST

ఆ వంతెన చూడటానికి చిన్నదే కావచ్చు. కానీ దాని అవసరం చాలా పెద్దది. ఒకట్రెండు కాదు ఏకంగా 14 మత్స్యకార గ్రామాల రాకపోకలకు అదే ఆధారం. అలాంటి వంతెన బీటలు వారి, పిల్లర్లు తుప్పు పట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలతో ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితిలో ఉంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజలు దానిపై ప్రయాణాలు సాగిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు.

Tags :

మరిన్ని