Vizag: అరాచక వైకాపాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన విశాఖ ప్రజలు

‘నా విశాఖ.. నా విశాఖ’ అంటూ ఎక్కడలేని ప్రేమ ఒలకబోసినా పొంగిపోలే. పరిపాలనా రాజధాని అంటూ ఊదరగొట్టినా లొంగిపోలే.. గెలిచిన వెంటనే ఇక్కడే కాపురం పెడతానన్నా విశ్వసించలే.

Published : 06 Jun 2024 13:00 IST

‘నా విశాఖ.. నా విశాఖ’ అంటూ ఎక్కడలేని ప్రేమ ఒలకబోసినా పొంగిపోలే. పరిపాలనా రాజధాని అంటూ ఊదరగొట్టినా లొంగిపోలే.. గెలిచిన వెంటనే ఇక్కడే కాపురం పెడతానన్నా విశ్వసించలే. ఆఖరికి ప్రమాణస్వీకారం విశాఖలోనే చేస్తానన్నా ఈవీఎం బటన్ నొక్కలే. వైకాపా అధికారంలోకి రాగానే రుషికొండపై విధ్వంసంతో నగరంలో పాదం మోపారు. విలువైన భూములు, ప్రాజెక్టులు గుప్పిట్లోకి తీసుకున్నారు. ప్రశాంత నగరం హత్యలు, కిడ్నాప్‌లు, గంజాయి మత్తుతో వణికిపోయింది. దీనిపై చైతన్యవంతులైన విశాఖవాసులు సార్వత్రిక ఎన్నికల్లో గట్టి తీర్పు ఇచ్చారు. వైకాపా అభ్యర్థులకు ఓటుతో బుద్ధి చెప్పారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు