Iran: ఇబ్రహీం రైసీ దుర్మరణం.. ఇరాన్‌లో ఏం జరగబోతోంది?

ఓ వైపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. అంతలోనే ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండగానే హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణంతో.. పశ్చిమాసియాలో మరో భారీ కుదుపు చోటుచేసుకుంది.

Updated : 22 May 2024 16:42 IST

ఓ వైపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. అంతలోనే ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండగానే హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణంతో.. పశ్చిమాసియాలో మరో భారీ కుదుపు చోటుచేసుకుంది. దేశం ఒకింత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ రైసీ మృతితో ఇరాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్-హమాస్ పోరులో పాలస్తీనాకు అండగా నిలవడమే కాకుండా అమెరికాకు వ్యతిరేకంగా బలమైన కూటమిని తయారు చేయాలని ముందుకు సాగుతున్న వేళ.. ఇరాన్‌కు ఇది ఊహించని పరిణామమే. మరి ఈ పరిస్థితుల్లో ఇరాన్‌లో ఏం జరగబోతోంది? రాజకీయ, పాలనాపరమైన అంశాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది? రైసీ మరణం వెనక చిరకాల శత్రువు ఇజ్రాయెల్ హస్తం ఉందని వెలువడుతున్న కథనాల్లో నిజమెంత? ఒక వేళ అదే నిజమని తేలితే రెండు దేశాల మధ్య ఘర్షణలు మరింత ముదురుతాయా?

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు