టెండర్లు పిలవకుండా నిర్మాణాలా?: అధికారులను నిలదీసిన జ్యుడిషియల్‌ కమిషన్‌

కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానం పాటించకుండా.. టెండర్లు పిలవకుండా.. నిర్మాణం, కొనుగోళ్ల వల్ల ఆర్థికభారం అధికమై ప్రజాధనం వృథా కాదా?

Published : 11 Jun 2024 13:12 IST

కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానం పాటించకుండా.. టెండర్లు పిలవకుండా.. నిర్మాణం, కొనుగోళ్ల వల్ల ఆర్థికభారం అధికమై ప్రజాధనం వృథా కాదా? అని యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్‌ నరసింహారెడ్డి జ్యుడిషియల్‌ కమిషన్‌ అధికారులను నిలదీసింది. ఈ మేరకు కమిషన్‌ సోమవారం విచారణ జరిపింది. గత భారాస ప్రభుత్వ హయాంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సురేష్‌ చందా, అప్పటి జెన్‌కో-ట్రాన్స్‌కోల సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావులను కమిషన్‌ కార్యాలయానికి పిలిపించి వివిధ కీలకాంశాలపై ప్రశ్నించింది.

Tags :

మరిన్ని