Hyderabad: రోడ్డంతా గుంతలే!.. నీటిలో కూర్చొని మహిళ నిరసన

హైదరాబాద్‌లోని నాగోల్ నుంచి ఉప్పల్ వచ్చే రహదారిపై ఓ మహిళ వినూత్నంగా నిరసన చేపట్టారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలోని మురికి నీటిలో కూర్చొని ఆందోళనకు దిగారు. రహదారి పూర్తిగా గుంతలమయం కావడంతో.. అటుగా వెళ్తుంటే ప్రమాదాలకు గురవుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 23 May 2024 19:04 IST

హైదరాబాద్‌లోని నాగోల్ నుంచి ఉప్పల్ వచ్చే రహదారిపై ఓ మహిళ వినూత్నంగా నిరసన చేపట్టారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలోని మురికి నీటిలో కూర్చొని ఆందోళనకు దిగారు. రహదారి పూర్తిగా గుంతలమయం కావడంతో.. అటుగా వెళ్తుంటే ప్రమాదాలకు గురవుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే రోడ్డుపై వెళ్తూ తమ పిల్లలు గతంలో ప్రమాదాలకు గురయ్యారని వాపోయారు. ఉప్పల్ నుంచి నాగోల్‌కి వచ్చేలోపు లెక్కించగా.. 30 గుంతలు ఉన్నట్టు చెప్పారు. ప్రజలు చెల్లించిన పన్నులను ఏం చేస్తున్నారంటూ జీహెచ్ఎంసీని ఆమె ప్రశ్నించారు. నాగోల్ కార్పొరేటర్, స్థానిక నేతలు మద్దతు ఇచ్చి.. జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడటంతో ఆమె అక్కడి నుండి వెళ్లిపోయారు.

Tags :

మరిన్ని