Kakinada: కాకినాడలో మంచి నీటి కోసం మహిళల అవస్థలు

కాకినాడలో తాగునీటి కొరత ఏర్పడింది. ఒకటి నుంచి 13 వార్డుల్లో నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు.

Published : 24 May 2024 15:49 IST

కాకినాడలో తాగునీటి కొరత ఏర్పడింది. ఒకటి నుంచి 13 వార్డుల్లో నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు. దీనికి తోడు తాగునీటి పైపు లీకేజీ కావడంతో సమస్య మరింత జఠిలమైంది. మరమ్మతులు చేసేందుకు కుళాయిల ద్వారా వచ్చే నీటి సరఫరాను నిలిపివేశారు. మూడ్రోజులుగా నీరు రాక జనం దాహం కేకలు పెడుతున్నారు. కొన్ని రోజులు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. దుమ్మలపేటలో ఒకే ఒక్క ట్యాంకర్ ద్వారా వచ్చే నీటి కోసం కాలనీల్లోని మహిళలంతా ఒకేసారి ఎగబడ్డారు. నీటి కోసం బిందెలు తీసుకుని వచ్చి ఒకరినొకరు తోసుకుంటూ రావడంతో తోపులాట జరిగింది.

Tags :

మరిన్ని