YS Jagan - Pinnelli: పిన్నెల్లి మంచివాడన్నారు.. ఇప్పుడేమంటారు జగన్‌?

‘‘మాచర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) నాకు మంచి స్నేహితుడు, మంచివాడు. మీ అందరికీ ఒక మాట చెబుతున్నా.. రామకృష్ణా రెడ్డిని అఖండమైన మెజారిటితో గెలిపించండి. ఇంకా పై స్థానంలోకి తీసుకెళతాను’’ అని మే నెల 6న మాచర్ల (Macharla)లో జరిగిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి జగన్‌ (YS Jagan) చెప్పారు. 

Updated : 22 May 2024 17:12 IST

పిన్నెల్లి మంచివాడన్నారు.. ఇప్పుడేమంటారు జగన్‌?

‘‘మాచర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) నాకు మంచి స్నేహితుడు, మంచివాడు. మీ అందరికీ ఒక మాట చెబుతున్నా.. రామకృష్ణా రెడ్డిని అఖండమైన మెజారిటితో గెలిపించండి. ఇంకా పై స్థానంలోకి తీసుకెళతాను’’ అని మే నెల 6న మాచర్ల (Macharla)లో జరిగిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి జగన్‌ (YS Jagan) చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రంలో అరాచకానికి, దౌర్జన్యానికి దిగిన వీడియోలు బయటకు రావడం, అరెస్టు చేయండి అంటూ ఎన్నికల సంఘం ఆదేశించడంతో.. ‘ఎంతో మంచివాడంటే.. పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించి అక్కడి వారందరినీ భయభ్రాంతులకు గురి చేసి, ఈవీఎంలు ధ్వంసం చేసేవారా?’ అని రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్నారు. ‘‘రామకృష్ణారెడ్డి మీకు మరింత స్నేహితుడు అంటున్నారు. అలాంటి వ్యక్తులే మీ స్నేహితులా? ఈవీఎం పగలగొట్టిన ఆయనపై చర్యలు తీసుకుంటారా? లేదా మరింత పై స్థానం కల్పిస్తానంటూ వెనకేసుకొస్తారా’’ అని ప్రశ్నిస్తున్నారు.

Tags :

మరిన్ని