AP News: బరితెగించిన వైకాపా ముఠాలు.. ఎసైన్డ్‌ భూములు కొట్టేసే కుట్ర

లక్షల ఎకరాల ఎసైన్డ్ భూములను కొట్టేసే కుట్రకు వైకాపా ప్రభుత్వం గతేడాది తెరలేపింది.

Published : 30 May 2024 09:49 IST

లక్షల ఎకరాల ఎసైన్డ్ భూములను కొట్టేసే కుట్రకు వైకాపా ప్రభుత్వం గతేడాది తెరలేపింది. 20 ఏళ్లకు ముందు (2003కు ముందు) ఇచ్చిన ఎసైన్డ్‌ భూముల్ని అమ్ముకునేందుకు వీలు కల్పించడం ద్వారా ఆయా వర్గాల పేదల్ని ఉద్ధరిస్తున్నామంటూ చట్టసవరణ చేసింది. జీఓ జారీకి ముందే ముఖ్య అధికారులు, వైకాపా నాయకులు ఒక్కో ప్రాంతంలో వందల ఎకరాల కొనుగోలుకు భారీ ఎత్తున ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాత బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. సీమలో పెద్దఎత్తున భూముల్ని దోచుకున్న ఈ పెద్దలు.. ఇప్పుడు ఉత్తరాంధ్రపై వాలిపోయారు. ఇక్కడా భారీ ఎత్తున భూములు చేతులు మారాయి. ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా మరింత భూమిని దోచేయాలనే ప్రణాళికల్లో నేతలు ఉన్నారు.

Tags :

మరిన్ని