Cyber Crime: అమ్మో.. సైబర్‌ నేరాలు ఇలా కూడా జరుగుతాయా?

ప్రస్తుత సాంకేతిక యుగంలో సరికొత్త విప్లవం ఇంటర్నెట్. సైబర్ మోసాలకు కూడా ఇంటర్నెట్ కేంద్రంగా మారింది. ఉద్యోగాల పేరుతో యువతను మోసగించి వారి చేత సైబర్ నేరాలు చేయిస్తున్న కాంబోడియా ముఠాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Published : 25 May 2024 18:47 IST

ప్రస్తుత సాంకేతిక యుగంలో సరికొత్త విప్లవం ఇంటర్నెట్. అరచేతిలో ఇమిడే స్మార్ట్ ఫోన్ ద్వారానే సకల సేవలూ పొందే వీలు కల్పించింది ఈ అంతర్జాలం. వస్తువుల కొనుగోలు నుంచి డబ్బుల చెల్లింపు వరకు కూర్చున్న చోటు నుంచే అన్నింటినీ పూర్తి చేసే వెసులుబాటు అందించింది. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. సైబర్ మోసాలకు కూడా ఇంటర్నెట్ కేంద్రంగా మారింది. రోజుకో కొత్త తరహా మోసంతో సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తుండగా, మరో నయా సంఘటన కలకలం సృష్టిస్తోంది. ఉద్యోగాల పేరుతో యువతను మోసగించి వారి చేత సైబర్ నేరాలు చేయిస్తున్న కాంబోడియా ముఠాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరి సైబర్ నేరగాళ్లు ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఏమిటి? ఎన్ని కట్టడి చర్యలు తీసుకుంటున్నా ఎందుకు వీరి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు? వీరి బారి నుంచి ప్రజలు ఎంత మేరకు అప్రమత్తంగా ఉండాలి?గా ఉండాలి?

Tags :

మరిన్ని