Kurnool: మహిళల వేషధారణలో పురుషులు.. హోలీ పండక్కి విభిన్నమైన ఆచారం!

హోలీ అంటే.. కాముని దహనం, రంగులు చల్లుకోవడమే అందరికీ తెలిసింది. కానీ, కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లుర్ గ్రామస్థులు ఈ పండుగకు విభిన్నమైన ఆచారాన్ని పాటిస్తున్నారు. హోలీ రోజున పురుషులు.. మహిళల వేషధారణలోకి మారిపోతారు. చీరలు కట్టుకుని ఆభరణాలు, పూలతో సింగారించుకుంటారు. రతీమన్మథులకు పూజలు చేస్తారు. తమ కోరికలు నెరవేరేందుకు ఇలా ప్రత్యేక పూజలు చేస్తున్నట్టు చెప్పారు. తరతరాల నుంచి తాము ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నట్టు స్థానికులు వివరించారు. 

Updated : 25 Mar 2024 20:09 IST

Tags :

మరిన్ని